Hyderabad: దీనిపైచిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ రంగరాజన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో అడ్డొచ్చిన ఆయన కుమారుడు గాయపడ్డాడు. దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
దాడికి కారణం
పోలీసుల కథనం ప్రకారం, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలో ఉన్న రంగరాజన్ నివాసానికి శుక్రవారం రోజు కొందరు వ్యక్తులు వచ్చారు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని ఆయనను కోరారు. అయితే, రంగరాజన్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. దీనికి గుర్రుగా, ఆ వ్యక్తులు ఆయన కుమారుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రంగరాజన్‌ను కూడా దాడి చేశారు.
చట్టపరమైన చర్యల కోసం ఫిర్యాదు
ఈ ఘటనపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారితో పాటు, వారికి సహకరించిన వ్యక్తులను కూడా గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

