Deputy cm: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా కాన్వాయ్‌పై దాడి జరిగినట్టు సమాచారం. ఈ ఘటన లక్షిసరాయ్ నియోజకవర్గంలోని ఖోరియారి పోలింగ్ బూత్ సమీపంలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం, ఆయన ఎన్నికల పర్యటనలో ఉండగా కొంతమంది అజ్ఞాత వ్యక్తులు రాళ్లు విసరడంతో వాహనాలు దెబ్బతిన్నాయి. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. అదనపు బలగాలు మోహరించగా, ప్రస్తుతం ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల కమిషన్ ఈ ఘటనపై నివేదిక కోరినట్లు సమాచారం.

