Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపుర్ జిల్లాలో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన చోటుచేసుకుంది. మూగ, చెవిటి సమస్యతో బాధపడుతున్న 11 ఏళ్ల బాలికపై ఒక కామాంధుడు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, పాశవికంగా హింసించాడు. ఈ ఘటన దేశాన్ని షాక్‌కు గురిచేసింది.
బాలిక గల్లంతు, తీవ్ర గాయాలతో కనిపించడం
మంగళవారం సాయంత్రం నుంచి బాలిక కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనతో ఆమె కోసం వెతుకుతుండగా బుధవారం ఉదయం పొలాల్లో నగ్నంగా, తీవ్ర గాయాలతో కనిపించింది. వెంటనే బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మీరట్‌కు తరలించాలని సూచించారు..
ఇది కూడా చదవండి: Pawan Kalyan: తెగేదాకా లాగిన వైసీపీ… పవన్ ఎంట్రీ!
సీసీటీవీ ఆధారంగా నిందితుడి గుర్తింపు
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు విచారణ ప్రారంభించి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దాంతోనే అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల డాన్ సింగ్‌పై అనుమానం కలిగింది. బాలికను మాయమాటలతో పొలాల్లోకి తీసుకెళ్లి, అత్యాచారం చేసినట్లు స్పష్టమైంది.
నిందితుడి కాల్పులు – పోలీసుల ప్రతికర్య
నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై డాన్ సింగ్ తుపాకీతో కాల్పులు జరిపాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ దాడిలో అతడి తొడలో బుల్లెట్ దూసుకెళ్లింది. చికిత్స అనంతరం అతడిని స్టేషన్‌కి తరలించారు.
చిన్నారిపై జరిగిన పాశవికత్వం
డాక్టర్ల ప్రకారం, ఒకరు కంటే ఎక్కువమంది బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. ముఖంపై పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు గాయాల స్థితి చెబుతోంది. బాలిక ప్రైవేట్ భాగాల్లోనూ తీవ్రమైన గాయాలున్నాయి. “ఇది నేను చూసిన అత్యంత ఘోరమైన లైంగిక నేరాల్లో ఒకటి,” అని వైద్యురాలు డాక్టర్ అంజు సింగ్ పేర్కొన్నారు.
ఈ సంఘటనపై సమాజం, ప్రభుత్వం తీవ్రంగా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. చిన్నారులు, ముఖ్యంగా దివ్యాంగులు ఈ స్థాయిలో హింసకు గురవడం శోచనీయమనీ, నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

