ATM Charges: ఆర్బీఐ ఇంటర్‌చేంజ్ ఫీజును పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో వచ్చే బ్యాంకు లావాదేవీలపై చార్జీల భారం పడనున్నది. ఈ మేరకు ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణపై మే నెల 1 నుంచి చార్జీలు పెరగనున్నాయి. ఉచిత పరిమితి మించితే లావాదేవీకి రూ.2 బ్యాలెన్స్, ఎంక్వైరీకి రూ.1 అదనంగా చెల్లించాల్సిందే. అంటే ఏటీఎం కార్డున్న బ్యాంకు ఏటీఎం నుంచి కాకుండా, మరో బ్యాంకు ఏటీఎం నుంచి ఈ లావాదేవీలు జరిగితే ఈ అదనపు చార్జీలు వర్తిస్తాయి. నిర్వహణ వ్యయాలు పెరుగుతున్నందున లావాదేవీల చార్జీలను పెంచాలని వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు గత కొంతకాలంగా కోరుతూ వస్తున్నారు.
ATM Charges: మెట్రో నగరాల్లో అయితే ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నెలకు 5 లావాదేవీలు, నాన్ మెట్రో ప్రాంతాల్లో నెలకు మూడు లావాదేవీలను ఉచితంగా జరుపుకోవచ్చు. ఈ పరిమితి దాటి తర్వాత జరిపే ప్రతి లావాదేవీపైనా అదనపు చార్జీల భారం పడుతుంది. ఒక్కో లావాదేవీకి రూ.17 నుంచి రూ.19 వరకు పెరుగుతుంది. బ్యాలెన్స్ ఎంక్వైరీకి ప్రతిసారికి రూ.6 నుంచి రూ.7కు పెరుగుతుంది. అంటే ఇక నుంచి ఏటీఎం లావాదేవీలను జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాలన్నమాట.