Atadu

Atadu: ‘అతడు’ రీరిలీజ్: రికార్డ్ డీల్‌తో బాక్సాఫీస్ షేక్!

Atadu: సూపర్‌స్టార్ మహేశ్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న ‘అతడు’ సినిమా గ్రాండ్ రీరిలీజ్‌కు సిద్ధమైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, మహేశ్ బాబు స్టైలిష్ పెర్ఫార్మెన్స్, బ్రహ్మానందం కామెడీతో 2005లో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపనుంది. కాకినాడకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా రీరిలీజ్ హక్కులను ఏకంగా రూ. 3.06 కోట్లకు కొనుగోలు చేసి, రీరిలీజ్ సినిమాల్లో రికార్డ్ ధరను నమోదు చేశారు.

Also Read: Viral News: పాక్​ నటికి వాటర్ బాటిల్స్ పంపిన ఇండియన్ ఫ్యాన్స్!

Atadu: ‘మురారి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి మహేశ్ సినిమాలు రీరిలీజ్‌లో భారీ వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో, ‘అతడు’ కూడా బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. మహేశ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ రీరిలీజ్ ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుంటుందనేది ఆసక్తికరం. మహేశ్ మ్యాజిక్ మరోసారి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *