Arvind Kejriwal

Arvind Kejriwal: మహిళలకు అరవింద్ కేజ్రేవాల్ బంపర్ ఆఫర్

Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మహిళా సమ్మాన్ పథకాన్ని ప్రకటించారు. ఈ సంక్షేమ పథకం కింద ఢిల్లీలోని మహిళలకు ప్రభుత్వం నెలకు రూ.1000 అందజేస్తుంది.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ మొత్తాన్ని నెలకు రూ.2100కు పెంచుతామని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో కర్నాటక గ్రిలాలక్ష్మి మోడల్‌లో ఓ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఢిల్లీ మహిళలకు నెలకు 2100. కేజ్రీవాల్ ఖాతాలో డబ్బు వేయడానికి ప్రణాళికలు ప్రకటించారు. ఢిల్లీ కేబినెట్‌లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు 1000. పొందుతారు.

ఇది కూడా చదవండి:Delhi Assembly Election: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పై పోటీచేసే కాంగ్రెస్ నేత ఈయనే

Arvind Kejriwal: పెన్షన్ పథకంలో భాగం కాని మహిళలు ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు కారు. ఈ పథకానికి అర్హులైన మహిళలు తాను ఏ ప్రభుత్వ పథకంలోనూ భాగం కాదని, ప్రభుత్వ ఉద్యోగి కాదని, ఆదాయపు పన్ను చెల్లించడం లేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ తో పాటు  మహిళ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *