Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం 300 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు అక్కడికక్కడే మరణించగా, మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం సమయంలో వాహనంలో మొత్తం 18 మంది జవాన్లు ఉన్నారని సమాచారం.
ఈ ఘటన ఎల్‌వోసీ (LOC) వద్ద బల్నోయి ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతుల వివరాలను అధికారులు త్వరలో వెల్లడించనున్నారు.