Ponguleti srinivas:; ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల గృహనిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. జనవరి 4 లేదా 5 తేదీ నాటికి 80 లక్షల మంది దరఖాస్తుదారుల డేటా ప్రభుత్వానికి చేరుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు అందించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఆ నిధులను సమకూర్చుతుందని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల ప్రాధాన్యత:
ఈ పథకం కింద అత్యంత పేదవారికి మాత్రమే ఇండ్లు అందించబడతాయి.Bప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు నిధులు కేటాయించనుందని తెలిపారు.
మొదటి దశలో 4.50 లక్షల ఇండ్లను రాబోయే కొద్ది రోజుల్లో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నాలుగేళ్లలో మొత్తం 20 లక్షల ఇండ్ల నిర్మాణానికి అవసరమైన యంత్రాంగం మరియు టెక్నాలజీని ఉపయోగించనున్నామని చెప్పారు.
అర్హుల ఎంపికలో ఎలాంటి లోపం లేకుండా, పూర్తిగా పారదర్శకత పాటించనున్నామని వెల్లడించారు.33 జిల్లాలకు ప్రాజెక్ట్ డైరెక్టర్లుగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థాయి అధికారులను నియమించామని వివరించారు. ఇప్పటి వరకు 80 లక్షల మంది ప్రజలు గృహనిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.