HDFC Bank

HDFC Bank: హెచ్‎డీఎఫ్‎సీ బ్యాంకులో ఘరానా మోసం.

HDFC Bank: పల్నాడు జిల్లాలోని నరసరావుపేట పట్టణంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నరసరావుపేట సమీపంలోని ఈపూరు మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన సొసైటీ సభ్యుడు ముప్పాళ్ల కోటేశ్వరరావు..హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో సొసైటీ పేరుతో ఖాతా తెరవాలని నిర్ణయించారు. ఆ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్యాంక్ మేనేజర్ శొంటి సాయిరాంను ఆయన సంప్రదించారు.నగదుతోపాటు.. అందుకు కావాల్సిన పత్రాలు ఇస్తే.. వెంటనే ఖాతా తెరుస్తామని ముప్పాళ్ల కోటేశ్వరరావుకు బ్యాంక్ మేనేజర్ సూచించారు. దీంతో అందుకు సంబంధించిన డాక్యుమెంట్లలోపాటు రూ.5 లక్షల చెక్కును బ్యాంక్ మేనేజర్‌కు అందజేశారు.

ఇది కూడా చదవండి: Seasonal Fruits: చలికాలంలో సీజనల్ ఫ్రూట్స్.. అస్సలు లైట్ తీసుకోవద్దు

HDFC Bank: అయితే నగదు మాత్రం.. సొసైటీ ఖాతాలో జమా కాలేదు. నెలలు గడుస్తున్నా నగదు మాత్రం ఖాతాలో జమా కాక పోవడంపై ముప్పాళ్ల కోటేశ్వరరావుతో పాటు ఇతర సొసైటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో బ్యాంక్ మేనేజర్‌ను వారు పలుమార్లు కలిసి విజ్జప్తి చేశారు. అయితే సొసైటి వారికి తెలియకుండా.. రూ. ఐదు లక్షల నగదు బ్యాంక్ మేనేజర్ శొంటి సాయిరాం డ్రా చేసినట్లు గుర్తించారు. దీంతో మేనేజర్‌ను కలిసి నిలదీసే ప్రయత్నం చేశారు.

HDFC Bank: దాంతో అతడు సొసైటీ సభ్యులతో బేర సారాలకు దిగాడు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును సొసైటీ సభ్యులు ఆశ్రయించారు. హెచ్‌డీఎఫ్‌సీ మేనేజర్ శొంఠి సాయిరాం చేసిన ఘరానా మోసాన్ని ఈ సందర్బంగా ఎస్పీకి వారు సోదాహరణగా వివరించారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ మేనేజర్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  సూపర్‌స్టార్ రజనీకాంత్‌ హెల్త్ బులిటెన్ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *