Aravind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన, తప్పడు హామీలతో కాంగ్రెస్ దొంగదారిన అధికారంలోకి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అర్వింద్ విమర్శించారు.
రాష్ట్రంలో భీకర వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులు, వరద బాధితులను ఇప్పటి వరకు ప్రభుత్వం ఆదుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ఇక పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు కోసం భూ సేకరణకు ఆదేశాలు జారీ చేసి, నిధులు కూడా విడుదల చేసినా.. తెలంగాణ ప్రభుత్వ పెద్దల్లో ఏమాత్రం చలనం లేదని ఆయన విమర్శించారు.
అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వ అవినీతిలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వాటాలు పొంది, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు విషయంలో మౌనం వహిస్తున్నారని కూడా ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.