AR Rahman: బాలీవుడ్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది రామాయణం సినిమా. దాదాపు రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, యష్, కాజల్ అగర్వాల్, సన్నీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్, హాలీవుడ్ లెజెండ్ హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: War 2 Vs Coolie: కూలీ vs వార్ 2: నార్త్ లో పైచేయి ఎవరిది?
రెహ్మాన్ ఇటీవల జిమ్మర్‌తో లండన్, లాస్ ఏంజిలెస్, దుబాయ్‌లలో జరిగిన సెషన్స్‌ను గుర్తు చేసుకున్నారు. భారతీయ సంస్కృతిపై జిమ్మర్ ఆసక్తిని ఆయన ప్రశంసించారు. జిమ్మర్ ఒక లెజెండ్ అని, అతనితో పని చేస్తానని ఊహించలేదని, అతను తన లాగే ఆలోచిస్తారాని రెహ్మాన్ అన్నారు. ఇక రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రం తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది.