AR Murugadoss: ఒకప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఏఆర్ మురుగదాస్ ఇప్పుడు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ‘గజిని’, ‘తుపాకి’, ‘కత్తి’ వంటి బ్లాక్‌బస్టర్‌లతో తన సత్తా చాటిన మురుగదాస్ నుంచి ఇటీవలి కాలంలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ‘స్పైడర్’, ‘సర్కార్’, ‘దర్బార్’,’సికిందర్’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో, మురుగదాస్‌తో సినిమా తీసేందుకు నిర్మాతలు జంకుతున్నారు. భారీ బడ్జెట్‌తో సినిమా తీసినా, ఆదరణ లేకపోతే నష్టాలు తప్పవనే ఆందోళనలో ఉన్నారు.
Also Read: Puri Jaganndh:పెద్ద నిర్మాతలను పట్టేసిన పూరీ?
AR Murugadoss: ఆయన చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో, ఆయనపై నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రస్తుతం ఆయన చేతిలో శివాకార్తికేయన్ తో చేస్తున్న ‘మదరాసి’ సినిమా మాత్రమే ఉంది. మరి ఆ సినిమాతో మురుగదాస్ మళ్లీ గాడిలో పడతాడా? లేక ఈ ఫ్లాప్ సెంటిమెంట్ కొనసాగుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైతే, మురుగదాస్‌తో సినిమా అంటే నిర్మాతలు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు.


