Pahalgam Terror Attack: చేతిలో ఆయుధం పట్టుకొని ఎదుటి వాడి దగ్గర ఎటువంటి ఆయుధం లేదు కదా అని వాడి మీద దాడి చేసి వాడ్ని చంపడాన్ని ఎం అంటారు..? చేతకానితనం కదా.. అదే చేశారు ఈ టెర్రరిస్టులు.. ఈ దాడుల్లో తెలుగు వారు మరణించారు.. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు.. మృతదేహం చూసి ఆ తల్లితండ్రుల గుండెలు పగిలాయి..
జమ్ముకశ్మీర్ పహల్గాంలో టెర్రలిస్టులు సృష్టించిన మారణహోమం దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. విహారయాత్రకు వెళ్లిన టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. చంపొద్దు అని వేడుకున్నా..ఏ మాత్రం కనికరం లేకుండా దారుణంగా పొట్టనపెట్టుకున్నారు దుర్మార్గులు.. ఈ ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మరణించారు.
ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన సాప్ట్ వేర్ మృతి చెందడంతో కావలిలో విషాదఛాయలు అలుముకున్నాయి. జమ్ముకాశ్మీర్ పర్యటనకు వెళ్లిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయాడు.. బెంగళూరులో స్థిరపడి మధుసూదన్ కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్ళగా ఈ ఘటన జరిగింది.
Also Read: Hyd: చేపల కూర కోసం హత్య చేసిన స్నేహితులు..
IBM సాఫ్ట్ వేర్ కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ గా మధుసూదన్ విధులు నిర్వహిస్తున్నారు. మధుసూదన్ ను కావలిలోని అన్నాల వారి వీధిలో నివాసముండే సోమిశెట్టి తిరుపాలు, పద్మ దంపతుల కుమారుడిగా గుర్తించారు. మృతుడు మధుసూదన్ కు భార్య మీనాక్షి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమిశెట్టి మధుసూదన్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడం ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకున్నాయి.
చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకున్న మధుసూదన్ పార్టవ దేహాన్ని కావలికి తరలించారు. ఈ క్రమంలో ఇంటి వద్ద మధుసూదన్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాళి ఆర్పించారు. మరోవైపు ప్రభుత్వ లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
వృత్తిలో ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఆశలు పండాయని వృద్ధ తల్లిదండ్రులు సంబరపడ్డారు. వేసవి విడిది కోసమని మధుసూదన్ సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న తన భార్య కామాక్షి, కుమారై మేధు, కుమారుడు దత్తుతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదుల తూటాలకు మధుసూదన్ బలయ్యారు.


