AP News:

AP News: ఏపీలో మ‌రో బ‌స్సులో మంట‌ల క‌ల‌క‌లం

AP News:ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని క‌ర్నూలు జిల్లాలో బ‌స్సు ద‌హ‌నం దుర్ఘ‌ట‌న‌, మ‌రో స్లీప‌ర్ బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌ల‌ను మ‌రువ‌క ముందే అదే రాష్ట్రంలో మ‌రో ఆర్టీసీ బ‌స్సులో మంట‌లు క‌ల‌క‌లం రేపాయి. పొగ వ్యాపించ‌గానే అప్ర‌మ‌త్త‌మైన డ్రైవ‌ర్ స‌మ‌యస్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి, ప్రయాణికుల‌ను దించివేశారు. వెంట‌నే పొగ‌నుంచి మంట‌లు వ‌చ్చేలోగానే ఆర్పివేశారు.

AP News:ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లానందిగామ హైవే వ‌ద్ద ఏపీఎస్ ఆర్టీసీ బ‌స్సుకు ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. విజ‌య‌వాడ నుంచి తెలంగాణ‌లోని కోదాడ ప‌ట్ట‌ణానికి వెళ్తున్న బ‌స్సు నుంచి ఒక్క‌సారిగా పొగ‌లు రావ‌డంతో అంతా ఆందోళ‌న‌కు గుర‌య్యారు. వెంట‌నే డ్రైవ‌ర్ బ‌స్సును రోడ్డు ప‌క్క‌న నిలిపి వేశాడు. ఇంజిన్ భాగం నుంచి పొగ‌లు క‌క్క‌డం క‌నిపించింది. వెంట‌నే ప్ర‌యాణికులు అంద‌రినీ కిందికి దించి వేశాడు.

AP News:ట్యాంక‌ర్ నుంచి ఇంధన లీకేజీ కార‌ణంగా ఇంజిన్ నుంచి పొగ‌లు వ‌చ్చాయని, మంట‌లు వ్యాపించేలోగా డ్రైవ‌ర్ వాటిని చ‌ల్లార్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. క‌ర్నూలు బ‌స్సు ఘ‌ట‌న‌తో ప్ర‌యాణికుల‌తో పాటు స్థానికుల్లో భ‌యాందోళ‌న నెల‌కొన్న‌ది. అంతా అప్ర‌మ‌త్త‌మై పొగ‌లు వ్యాపించ‌కుండా చొర‌వ తీసుకున్నారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *