AP News: సోషల్ మీడియా వెర్రితలలు వేస్తుందనడానికి ఇదీ ఓ నిదర్శనం. చట్టాలు తెలియక కొందరు.. తెలిసినా వ్యూస్ కోసం ఇంకొందరు.. ఏమీ కాదులే అని ధీమాతో ఎందరో.. ఇలా ఏదో ఒకటి తమకు తోచిన రీతిలో వీడియోలు చేస్తూ ఆనంద పడుతున్నారు. పలువురు సెల్ఫ్ కంట్రోల్ తప్పుతూ ఏదేదో వాగేస్తున్నారు. వీడియోలు చేసేస్తున్నారు. ఇదీ అలాంటి కోవలోకే వస్తున్నది. లైక్‌లు, వ్యూస్ కోసం ఉడుమును వండిన వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి కటకటాల పాలయ్యారు ఇద్దరు ఘనులు.
AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన్యం పార్వతీపురం మండలంలో యూట్యూబర్లు చీమల నాగేశ్వరరావు, నానిబాబు యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ ఉంటారు. తాజాగా ఉడుమును వండుకొని తిన్నారు. ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోపై యానిమల్ పరిరక్షణ సభ్యులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు ఆ యూట్యూబర్లను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.