AP News:వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానితోపాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల మెడికల్ కళాశాల ఎదుట ధర్నాకేసులో వైసీపీ కార్యకర్తలను రోజూ స్టేషన్కు పిలిచి పోలీసులు వేధిస్తున్నారని పేర్ని నానికి తెలిసింది. దీంతో ఆయన ఏకంగా మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. మాట్లాడాలని స్టేషన్కు రప్పించి, సుబ్బన్న అనే కార్యకర్తను ఎలా అరెస్టు చేశారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఆర్ పేట సీఐ ఏసుబాబుపై పేర్నినాని దౌర్జన్యం చేశారని చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
