AP News: మొంథా తుఫాన్ ప్రభావంతో వర్షంధాటికి ప్రముఖ కాలజ్ఞాని, ఆత్మజ్ఞాన ప్రబోధకులు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం ఉన్న గృహం కులిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని బద్వేలు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న బ్రహ్మంగారి మఠం (కందిమల్లయపల్లె)లోని 17వ శతాబ్దంలో బ్రహ్మంగారి కుటుంబం నివాసం ఉన్న ఇల్లు ఒకవైపు భాగం కుప్పకూలింది.
AP News: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం ఉన్న ఆ గృహంలో ఉన్నప్పుడే కాలజ్క్షాన రచనలు సాగించారు. ఆ ఊరి సమీపంలోనే ఉన్న రవ్వల కొండ అనే ప్రాంతంలో ఆ రచనలు చేశారని ప్రతీతి. 1608 నుంచి 1693 వరు ఆయన నివసించారని ఆధారాలు ఉన్నాయి. అదే ఇంటిలో ఆయన కులవృత్తిని కొనసాగించారని చెప్తారు. ఆయన తదనంతరం ఆ ఇల్లును పరమ పవిత్ర స్థలంగా భావిస్తూ వస్తున్నారు. ఆ ప్రాంతం ఇప్పుడు పుణ్యక్షేత్రంగా బాసిల్లుతుంది.
AP News: దశాబ్దాల కాలంగా చెక్కు చెదరకుండా ఉన్న ఇల్లు కూలిపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చారిత్రక స్థలాన్ని కాపాడటంలో అధికారులు, మఠం వారసులు విఫలమయ్యారని భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇతర భాగం ఇంటిని కాపాడి, బ్రహ్మంగారి చారిత్రక వారసత్వాన్ని ముందు తరాలకు తీసుకెళ్లాలని కోరుతున్నారు.

