Crime News: మెడలోని ..పుస్తెల తాడు కోసం చంపేశాడు. ఇదే పని గా …పక్క రాష్ట్రాల నుంచి వచ్చి …రాష్ట్రాల సరిహద్దుల్లో …చంపేస్తున్నాడు. ఇంతకీ వాడు చంపేది..చిన్న చిన్న బంగారు నగల కోసం. జస్ట్ …స్మాల్ చైన్ కోసమైనా..సిల్లీగా పీకలు కోసేస్తాడు. చంపి..బంగారాన్ని…దర్జాగా ..తాకట్టు పెట్టి …డబ్బులతో జల్సా చేయడమే ..ఆ ఎదవ పని. మొత్తానికి ఇప్పుడు అలానే ఒక ఆమెను చంపేశాడు
ఏపీ అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్కవరం మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మూడు వారాల క్రితం చోడవరం మండలంలో జరిగిన ఒక మహిళ హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా చోడవరం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనవరి 9వ తేదీన చోడవరం మండలం లక్కవరం గ్రామానికి చెందిన ఒబ్బల రెడ్డి నరసింహమూర్తి భార్య నరసమ్మ అదే గ్రామానికి చెందిన గోపాలయ్య పొలంలోకి మేకలు మేతకై కత్తి పట్టుకుని వెళ్లింది. అయితే చీకటి పడిన భార్య ఇంటికి రాకపోవడంతో భర్త ఆమె వెళ్లిన ప్రాంతానికి వెళ్లి వెతకగా ఆమె స్పృహ కోల్పోయి బండారు లక్ష్మమ్మ పొలంలో కనిపించింది.
ఇది కూడా చదవండి: Jr NTR: అభిమానులకు ఎన్టీఆర్ కీలక సందేశం..
ఆ మెడలో మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు కనిపించలేదు. ఆమె శరీరంపై రక్తస్రావం గుర్తించిన భర్త భార్య మృతి చెందినట్లు నిర్ధారించుకుని చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విస్తృత దర్యాప్తును ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హత్య జరిగిన చుట్టుపక్కల ప్రాంతాలను విచారించి సిసి టీవీ ఫుటేజ్ లను పరిశీలించి, అనేకమంది సాక్ష్యాన్ని విచారించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరించినట్లు చెప్పారు. సిసిటిఎన్ఎస్ ఉపయోగించి నిందితుడి గత నేరాలను ధృవీకరించి, కాల్ డేటా రికార్డులను సేకరించి.. మెసేజ్, కాల్ లాక్స్, బ్యాంక్ స్టేట్మెంట్ల ద్వారా కీలక సమాచారం సేకరించమన్నారు.
ఇక నిందితుడు హత్య చేసిన తర్వాత బంగారం వస్తువులను విజయనగరం జిల్లా కొత్తవలస ముత్తూట్ ఫైనాన్స్ లో 1లక్ష 85 వేల రూపాయలకు తాకట్టు పెట్టినట్టు గుర్తించమని పోలీసులు తెలిపారు. బ్యాంకు లావాదేవీలు పరిశీలించి, ఏటీఎం రిసీట్లు, అండర్ ట్రాన్స్ఫర్లు ట్రాక్ చేసి, నిందితుడే ఆర్థిక లావా దేవిలను అనుసరించడం జరిగిందన్నారు. అలాగే నిందితుడి కదలికలపై ప్రత్యేక పర్యవేక్షణ జరిపి మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఛతీస్ గడ్ రాష్ట్రంలో అతడి కదలికలు గుర్తించమన్నారు. సిడిఆర్ డేటాలో ఉన్న బి పార్ట్ నెంబర్లను ఉపయోగించి ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి మిగిలిన నిందితుల వివరాలు సేకరించమన్నారు. జిల్లా జైలు అధికారుల నుంచి అతడిపై ఉన్న పాత కేసులు గురించి ఆరాతీయగా నిందితుడి అత్యంత సన్నిహితుల సమాచారం తెలిసిందన్నారు.

