Tollywood

Tollywood: టాలీవుడ్‌తో ఏపీ సర్కార్ కీలక భేటీ.. సినిమా సమస్యలపై చర్చకు రంగం సిద్ధం!

Tollywood: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ఏపీ ప్రభుత్వం టాలీవుడ్‌కు పూర్తి సహకారం అందిస్తున్నప్పటికీ, కొందరు ప్రముఖులు సహకరించడంలో వెనుకడుగు వేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో కలిపి 30 మంది సభ్యులున్నారు.

Also Read: Cocaine Seized: రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..తొమ్మిది మంది అరెస్ట్

Tollywood: ఇదిలా ఉంటే, టాలీవుడ్ పెద్దలు ఈ ఆదివారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవనున్నారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో సినిమా పరిశ్రమకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో దాదాపు 30 మంది సినీ ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ భేటీ ఫలితంగా టాలీవుడ్‌కు నూతన దిశానిర్దేశం లభిస్తుందని ఆశిస్తున్నారు. ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొంటారనేది ఆసక్తికరంగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *