Nara Lokesh

Nara Lokesh: ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్.. మా’స్టార్స్’.. మీకు హేట్సాఫ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వం, ప్రభుత్వం పాఠశాలలను మెరుగుపరిచి, కార్పోరేట్ స్కూళ్లకు సమానంగా తీర్చిదిద్దుతోంది. మరింత ఆధునిక వసతులు, మంచి బోధనతో పిల్లలకు ఉన్నత విద్యనందిస్తోంది. కానీ కొందరు తల్లిదండ్రులు మాత్రం ఇంకా ప్రైవేట్ పాఠశాలలకే మొగ్గుచూపుతున్నారు.

ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ ఉపాధ్యాయులే పెద్ద సాహసం చేశారు. తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో కాదు.. ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి అందరికీ మంచి ఉదాహరణగా నిలిచారు.

‘‘ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువు మంచిది.. మేము కూడా మా పిల్లలను ఇక్కడే చదిపిస్తున్నాం’’ అని చెప్పి సమాజానికి ఓ సందేశాన్ని ఇచ్చారు.

టీచర్లను అభినందించిన లోకేష్

ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ వారికి అభినందనలు తెలిపారు.
‘‘మీరు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదిపించడం నిజంగా ఆదర్శనీయం. మీ పిల్లల ఫలితాలు ప్రభుత్వ విద్యకు బలం ఇస్తున్నాయి’’ అని మంత్రి ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: Ramachander Rao: సీఎంకు లేఖ‌తో బీజేపీ రామచంద‌ర్‌రావు పోరు షురూ

పశ్చిమ గోదావరి టీచర్లకు ప్రత్యేక అభినందనలు

పశ్చిమ గోదావరి జిల్లా టీచర్లు ప్రత్యేక గుర్తింపు పొందారు.

  • జిన్నూరు జడ్పీ పాఠశాల స్కూల్ అసిస్టెంట్‌ బొంతు మధుబాబు

  • పంగిడిగూడెం ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బాబూ రాజేంద్రప్రసాద్‌

  • సోమరాజుచెరువు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వీరవాసరపు బాలకరుణాకరరావు
    ఈ ముగ్గురూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదిపిస్తూ మిగిలినవారికి స్ఫూర్తిగా నిలిచారు.

మా’స్టార్స్’.. నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు!

ఈ టీచర్లను మంత్రి లోకేష్‌ ‘‘ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్.. మా’స్టార్స్’.. మీకు హ్యాట్సాఫ్‌!’’ అంటూ గౌరవించారు.
సాధన వల్లే ప్రభుత్వ పాఠశాలలు ముందుకు పోతున్నాయనే మాట నిజమే!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Dwarampudi: ద్వారంపూడి ఫ్యాక్టరీ మూత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *