Uttam Kumar Reddy: రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీలో రాష్ట్ర సాగునీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక సమాచారం ఇచ్చారు. నూతన కార్డుల కోసం దరఖాస్తు వారిలో 2.4 లక్షల కొత్త కార్డులను పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ కార్డుల పంపిణీని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు.
Uttam Kumar Reddy: సీఎం లాంఛనంగా రేషన్‌కార్డుల పంపిణీని ప్రారంభించన అనంతరం నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నూతనంగా 2.4 లక్షల రేషన్ కార్డుల ద్వారా 11.30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు. గడిచిన ఆరు నెలల్లో తమ ప్రభుత్వం 41 లక్షల మందికి కొత్తగా రేషన్‌కార్డులను అందించినట్టు వివరించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ అందిస్తామని ఆయన ప్రకటించారు.
Uttam Kumar Reddy: నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా నిర్వహించే దిశగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తున్నది. ఇందుకు అనుగుణంగా కొత్త కార్డులను నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. పంపిణీ చేసే తేదీలతోపాటు ప్రాంతాలను స్థానిక అధికారులు ప్రకటిస్తారు. స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త కార్డులను ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించగా, కొత్తకార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్‌తో ఉన్న స్మార్ట్ కార్డుల పంపిణీ దిశగా పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.