Ramachander Rao: బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక రామచంద్రరావు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై లేఖ రాశారు. ఈ మేరకు అధ్యక్షుడిగా ఆయన తొలి పోరాటం ఆరంభించారు. సర్కార్ వైఫల్యాలను ఆ లేఖలో ఎండగట్టారు. ప్రజలకు ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Ramachander Rao: 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు నేటికి 600 రోజులైనా ఎందుకు పూర్తికావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. నాడు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 20 నెలలైనా అమలు చేయలేకపోతున్నారని విమర్శించారు.
Ramachander Rao: ఆరు గ్యారెంటీలతో 63 అనుబంధ హామీలతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతకాలతో నాడు ఊరూరా పంచిపెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఎద్దేవా చేశారు. అన్ని ప్రధాన పత్రికల్లో మొదటి పేజీల్లో ప్రకటనలను గుప్పించారని తెలిపారు. అయినా ఇన్ని రోజులు గడిచినా ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయారని విమర్శించారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో హామీలను అమలు చేయాలని, లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు.