Lenin: అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ‘లెనిన్’ (Lenin) సినిమాపైన టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు విడుదలైన చార్ట్‌బస్టర్ సాంగ్స్, పోస్టర్స్, టీజర్, ‘సోల్ ఆఫ్ లెనిన్’ గ్లింప్స్ ఇంకా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే జులై 10న (10-07-2026) థియేటర్లలో ఈ సినిమా సృష్టించబోయే విధ్వంసాన్ని చూసేందుకు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ‘కింగ్’ అక్కినేని నాగార్జున చేసిన స్పీచ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా విజయంపై ఆయన అత్యంత నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సినిమా ట్రైలర్ లో నాగార్జున వాయిస్ ఓవర్ చెప్పి సినిమాలో కథ జరిగే ప్లేస్ గురించి కొంత విషయం చెప్పారు కానీ సినిమా విషయానికి వస్తే ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎన్టీఆర్ (NTR) ‘లెనిన్’ సినిమా జరిగే ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాకి తన వాయిస్ ఓవర్ (Voice-over) అందించారు అని తెలుస్తుంది.
సినిమాలోని ‘శ్రీరామపురం’, ‘భారతం మిట్ట’ అనే గ్రామాలు, అక్కడి ఆచారాలు, ఇంకా వాటి వెనుక ఉన్న బలమైన నమ్మకాలు లను ఎన్టీఆర్ తన గంభీరమైన స్వరంతో వివరించిన తీరు సినిమాకు ఒక మైథలాజికల్ (పురాణాల తరహా) ఎలివేషన్‌ను ఇవ్వనుంది అని అని టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ బేస్ వాయిస్‌కు ఉన్న పవర్‌తో ఈ కథాంశం మొత్తం ఒక సినిమాటిక్ ఎపిక్‌లా మారిపోయింది. ఒకే వేదికపై ఎన్టీఆర్ వాయిస్, అఖిల్ నటన, నాగార్జున నిర్మాణ విలువలు తోడవడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఎన్టీఆర్ వాయిస్‌తోనే సినిమా ప్రారంభం కానుంది.
మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సర్వం సిద్ధమైంది. ‘మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ’ మరియు ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది.
