Ap news: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సంక్షేమం, సాధికారత, భద్రత కోసం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు అనేక పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించింది.
ముఖ్య కార్యక్రమాలు:
1. మహిళా వ్యాపారవృద్ధికి ప్రోత్సాహం:
సెర్ప్, మెప్మా, ఎంఎస్ఎంఈ విభాగాల ద్వారా లక్ష మంది మహిళా ఎంటర్ప్రెన్యూర్లను తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మెప్మాలో 30 వేల మంది, రాపిడోలో 10 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించనున్నారు.
స్వయం ఉపాధి, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పర్యాటక అనుబంధ రంగాలు, తృప్తి హోటల్స్, స్మార్ట్ స్ట్రీట్స్ వెండింగ్ జోన్, టిడ్కో జీవనాధారం కేంద్రాల ద్వారా వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించనున్నారు.
ఎంఎస్ఎంఈ రంగంలో 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 2025-26 సంవత్సరానికి యాక్షన్ ప్లాన్ విడుదల చేశారు.
2. ‘శక్తి టీమ్స్’ ప్రారంభం:
మహిళలు, పిల్లల భద్రత కోసం ‘శక్తి టీమ్స్’ ను ఏర్పాటు చేశారు.బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు, నేరాలు అరికట్టే దిశగా ఈ టీమ్స్ పని చేయనున్నాయి.
3. చేనేత రంగ ప్రోత్సాహం:
చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు చేనేత రథాలను ప్రారంభించారు. జిల్లాకు ఒక్కో వ్యానును రూ.60 లక్షల వ్యయంతో అందించనున్నారు.ఒక్కో చేనేత మహిళకు 36 చీరలు నేసేందుకు సరిపడా నూలును ఉచితంగా పంపిణీ చేశారు.
4. ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ:
1.50 లక్షల మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నారు.ఉచిత శిక్షణతో పాటు కుట్టుమిషన్లు అందజేస్తారు.
5. డ్వాక్రా ఉత్పత్తుల రికార్డు విక్రయాలు:
“మహిళలకు మహిళల కోసం మహిళల చేత” కార్యక్రమంలో భాగంగా వావ్ జీని యాప్ ద్వారా రూ.5.13 కోట్ల విలువైన డ్వాక్రా ఉత్పత్తులను విక్రయించారు.దీనికి గాను గిన్నిస్ రికార్డు సాధించి సీఎం చంద్రబాబుకు అందజేశారు.
6. బ్యాంకు రుణాల పంపిణీ:
7,471 మంది పట్టణ పేద మహిళలకు 645.52 కోట్ల బ్యాంకు రుణాలను అందించారు..43 లక్షల గ్రామీణ మహిళలకు రూ.1,826.43 కోట్ల ఉత్పాదక రుణాలు మంజూరు చేశారు.
7. ఇ-కామర్స్ ద్వారా విక్రయాలు:
డ్వాక్రా ఉత్పత్తుల విక్రయాలకు ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.మహిళల వ్యాపార ప్రోత్సాహానికి క్యాటలిస్టు మేనేజ్మెంట్ సర్వీసెస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
8. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు:
ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్మెంట్లతో ఒప్పందం చేసుకున్నారు.డ్వాక్రా మహిళల సేంద్రీయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది.
9. చిన్న తరహా హోటల్ వ్యాపార ప్రోత్సాహం:
డ్వాక్రా మహిళలకు హోటల్ వ్యాపారం పై అవగాహన కల్పించేందుకు గాటోస్ కేఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
10. సర్వీస్ ప్రొవైడర్లకు శిక్షణ:
హోమ్ ట్రయాంగిల్ సంస్థతో ఒప్పందం ద్వారా 18,515 మంది సర్వీస్ ప్రొవైడర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, బ్యూటీషియన్లు, గృహోపకరణ మరమ్మతు నిపుణులకు శిక్షణ అందించనున్నారు.వీరికి నెలకు రూ.15,000 – రూ.35,000 ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నారు.
11. రాపిడో మహిళా రైడర్లకు ఉచిత సేవలు:
రాపిడో మహిళా రైడర్లకు ఆన్‌బోర్డింగ్ ఛార్జీలు, నెలవారీ చార్జీలను మూడు నెలల పాటు మాఫీ చేశారు.1,000 ఎలక్ట్రిక్ వాహనాలు మహిళలకు అందించారు. ఇందులో 760 ఈ-బైకులు, 240 ఈ-ఆటోలు ఉన్నాయి.
12. అరకు కాఫీ విస్తరణ:
నేచర్ అరకు కాఫీ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు.గ్లోబల్ మార్కెట్లో అరకు కాఫీ ఉత్పత్తులను ప్రోత్సహించనున్నారు.మొదటి విడతలో 100 అరకు కాఫీ అవుట్లెట్లు ఏర్పాటు చేయనున్నారు.
13. అంగన్వాడీ కార్మికులకు గ్రాట్యూటీ:
55,607 అంగన్వాడీ వర్కర్లకు, 48,909 హెల్పర్లకు గ్రాట్యూటీ అమలు చేయనున్నారు.ఒక్కో వర్కర్‌కు రూ.1.79 లక్షల నుంచి రూ.2.32 లక్షల వరకు లబ్ధి కలుగుతుంది.
14. ఆశా వర్కర్లకు గ్రాట్యూటీ అమలు:
2024 జూన్ నుంచి రిటైర్డ్ అయిన ఆశా వర్కర్లకు గ్రాట్యూటీ అమలు చేశారు.ఇప్పటివరకు రూ.1.90 కోట్లు విడుదల చేశారు.
15. పీఎం – విశ్వకర్మ పథకం ద్వారా రుణాలు:1,000 మంది మహిళలకు రూ.1 లక్ష వరకు రుణం మంజూరు చేశారు.
ఈ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిమహిళలకు ఉపాధి, ఆర్థిక స్వావలంబన కల్పించనున్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు భవిష్యత్తులో మరింత ప్రయోజనం కలిగిస్తాయి.