AP Constable Results 2025: ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన వార్త. ఈరోజు (మంగళవారం) ఉదయం 11 గంటలకు సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత విడుదల చేయాల్సిన కానిస్టేబుల్ తుది పరీక్షా ఫలితాలు వాయిదా పడ్డాయి. తుది జాబితాను నియామక బోర్డు మరోసారి జాగ్రత్తగా పరిశీలించాలని నిర్ణయించడంతో, ఫలితాల విడుదల రేపటికి వాయిదా పడింది.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రేపు (బుధవారం) సరిగ్గా ఉదయం 11 గంటలకు సచివాలయంలోనే హోంమంత్రి వంగలపూడి అనిత కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.
న్యాయ వివాదాలతో జాప్యం
కాగా, ఈ కానిస్టేబుల్ పరీక్షను 2022 అక్టోబర్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని న్యాయ వివాదాల కారణంగా తుది ఫలితాలను ప్రకటించడంలో జాప్యం జరిగింది. ఇప్పటికే రెండు వారాల క్రితం అభ్యర్థులకు ర్యాంక్ కార్డులను కూడా విడుదల చేశారు.