Ap news: ఉప సభాపతిగా RRR ఎన్నిక..

Ap news: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికైన కూటమి ప్రభుత్వం ఉప సభాపతిని నియమించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతిగా ఉండి ఎమ్మెల్యే, రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గురువారం సభలో ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామకు ఆయన అభినందనలు తెలిపారు. అంతకుముందు ఎన్డీయే కూటమి తరఫున డిప్యూటీ స్పీకర్ పదవికి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేరును కూటమి నేతలు ప్రకటించారు.

దీంతో కూటమి నేతలతో కలిసి రఘురామ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఇతరులు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో గురువారం మధ్యాహ్నం స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ గా రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan Kalyan: ఈ కథలన్నీ నా దగ్గర వద్దు..DSP పవన్ వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *