Hyderabad: హైదరాబాద్‌లో భారీ మోసం బట్టబయలైంది. అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించి వాటిని క్రిఫ్టో కరెన్సీగా మార్చుతూ కోట్లకు పరుగులు పెట్టిన ఓ కేటుగాళ్ల ముఠాను పోలీసులు తాజాగా పట్టుకున్నారు. ఇందులో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు రీసెంట్గా దాడులు నిర్వహించగా ఓ నకిలీ సంస్థ వ్యవహారం బయటకొచ్చింది. అనేక అక్రమ లావాదేవీలు, చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు దాదాపు 65 మందిని అరెస్టు చేశారు. అందులో ఎగ్జిటో సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ చందా మనస్విని కూడా ఉన్నారు.
కాగా వీరు టెలికాలర్లుగా ఫేక్ కాల్స్ చేస్తూ అమెరికాలో ఉంటున్న భారతీయుత్ని టార్గెట్‌గా పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఒక రహస్య సమాచారం ఆధారంగా.. టిజి సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టిజిసిఎస్బి) సిబ్బంది మధాపూర్లోని ఒక భవనంలో ఉన్న కాల్ సెంటర్లో దాడులు నిర్వహించారు. అది నకిలీ కాల్ సెంటర్‌గా పోలీసులు గుర్తించారు. చట్టబద్ధమైన వ్యాపారం ముసుగులో నడుస్తున్న నకిలీ కాల్ సెంటర్ అని తెలిపారు.
Also Read: Crime News: విద్యార్థినిపై అత్యాచారం.. వీడియో తీసి వికృతం.. ఇద్దరి అరెస్ట్
ఈ మోసపూరిత ఆపరేషన్‌తో ప్రతి రోజూ అమెరికాలో ఉంటున్న వందలాది మంది భారతీయుల్ని వీరు మోసం చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ విషయంపై టిజిసిఎస్బి డైరెక్టర్ శిఖా గోయెల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ మోసపూరిత చర్యలకు పాల్పడిన ముఠాను పట్టుకున్నామని తెలిపారు. దాదాపు 65 మందిని అదుపులోకి తీసుకున్నామని.. వారిని ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించామన్నారు. వీరు ఎన్ఆర్ఐలు, యుఎస్ పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు, మోసపూరిత సంస్థలో పనిచేస్తున్నట్లు కనుగొన్నామని తెలిపారు.