Stalin: డీలిమిటేషన్ ప్రతిపాదనలపై దక్షిణాది రాష్ట్రాల ఆందోళన పెరుగుతున్న వేళ, తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలను ఐక్యపరిచేందుకు ఆయన అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.
సీనియర్ నేతలను పంపాలని పిలుపు
స్టాలిన్ రాసిన లేఖలో ప్రతి పార్టీ తమ తరపున సీనియర్ నేతలను సమావేశానికి పంపాలని కోరారు. ఈ ఆహ్వానం టీడీపీ, కాంగ్రెస్, జనసేన, వైసీపీ, ఏపీ బీజేపీ సహా అన్ని దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీలకు అందింది.
డీలిమిటేషన్ వ్యతిరేక అఖిలపక్ష తీర్మానం
ఈ సమావేశంలో డీలిమిటేషన్ ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించి, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించే విధంగా ఉన్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక అఖిలపక్ష తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ నిర్ణయం ద్వారా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తును రక్షించేందుకు మార్గం సిద్ధం చేయాలనే ఉద్దేశ్యంతో జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటుకానుంది.
మార్చి 22న తొలి సమావేశం
ఈ జేఏసీ తొలి సమావేశం మార్చి 22న చెన్నైలో జరగనుంది. అన్ని పార్టీల ప్రముఖ నాయకులు ఈ భేటీకి హాజరై, డీలిమిటేషన్ ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం ఈ సమావేశం కీలకంగా మారనుంది.
డీలిమిటేషన్ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల ఐక్యతపై జరుగనున్న ఈ చర్చలు, భవిష్యత్ రాజకీయ దిశను నిర్దేశించే అవకాశముందని విశ్లేషకులుభావిస్తున్నారు.