Samantha

Samantha: సమంత బ్యానర్‌లో మరో సినిమా సిద్ధం?

Samantha: సమంత నిర్మాతగా మరోసారి సందడి చేస్తోంది. ఆమె బ్యానర్‌లో తాజాగా విడుదలైన చిత్రం ‘శుభం’ భారీ హైప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి, మిశ్రమ స్పందనను అందుకుంది. అయితే, సమంత తొలుత ప్రకటించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’పై అందరి దృష్టి నెలకొంది. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో కనిపించనుంది. తుపాకీ పట్టుకున్న ఆమె లుక్‌తో కూడిన పోస్టర్‌తో ఈ మూవీ అనౌన్స్‌మెంట్ హైప్‌ను క్రియేట్ చేసింది. అయితే, ఊహించని విధంగా ‘శుభం’ ముందుగా రిలీజ్ అయింది. తాజా సమాచారం ప్రకారం, ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ దాదాపు పూర్తయిందని, ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఒకే ఏడాదిలో రెండు చిత్రాలను నిర్మాతగా విడుదల చేయడం సమంత సత్తాను చాటుతోంది. అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ వార్త సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది. సమంత ఈ ప్రాజెక్ట్‌తో మరో హిట్ కొట్టనుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *