Annu Kapoor: ప్రియాంక చోప్రా తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చినా బాలీవుడ్ లో స్థిరపడి హాలీవుడ్ లో కూడా పేరు తెచ్చుకున్న నటి. హాలీవుడ్ స్టార్ ను పెళ్ళాడి అక్కడే స్థిరపడ్డ ఈ నటి కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు క్యాకర్టర్ ఆర్టిస్ట్ తో ముద్దుకు నో చెప్పిందట. అప్పటి విషయాన్ని ఇటీవల ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు నటుడు, హోస్ట్ అన్ను కపూర్. ప్రియాంక ప్రధాన పాత్రలో విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో యుటీవీ నిర్మించిన చిత్రం ‘సాత్ ఖూన్ మాఫ్’. ‘సుసాన్స్ సెవెన్ హజ్బెండ్స్’ ఆధారంగా నిర్మితమైన ఈ చిత్రంలో ఏడుగురు భర్తలుగా నీల్ నితిన్ ముఖేశ్, జాన్ అబ్రహాం, ఇర్ఫాన్ ఖాన్, అలెగ్జాండర్, అన్నుకపూర్, నసీరుద్దీన్ షా, విహాన్ షా నటించారు.
Annu Kapoor: పెళ్ళి తర్వాత భర్తలను చంపే స్త్రీ పాత్రలో ప్రియాంక నటించింది. ఇక ఐదవ భర్తగా నటించిన అన్నుకపూర్ ప్రియాంక తనను ముద్దుపెట్టుకోవడానికి ఇష్టపడలేదని, ఈ విషయాన్నిచెప్పి సీన్ ను మార్చాలని ప్రియాంక కోరినట్లు దర్శకుడు విశాల్ తెలిపాడన్నారు. దాంతో సీన్ మార్చవలసి వచ్చిందని, హీరోయిన్స్ యంగ్ హీరోలను ముద్దు పెట్టుకోవడానికి ఇష్టపడతారని, ఇతరులతో మాత్రం సిగ్గుపడుతుంటారని వ్యాఖ్యానించాడు. ఇక ‘సాత్ ఖూన్ మాఫ్’లో ప్రియాంక బోల్డ్ సీన్స్ చాలా ఉన్నాయి. సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నడిచింది.