Annavaram:

Annavaram: అన్న‌వ‌రం ఆల‌య ప‌రిస‌రాల్లో అగ్నిప్ర‌మాదం.. భారీగా ఆస్తిన‌ష్టం

Annavaram: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా ప్ర‌సిద్ధ అన్న‌వ‌రం ఆల‌య ప‌రిస‌రాల్లో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది. ర‌త్న‌గిరి ప‌డ‌మ‌ర రాజ‌గోపురం ఎదుట గ‌ల దుకాణాల్లో ఒక్కసారిగా మంట‌లు చెల‌రేగాయి. దుకాణ నిర్వాహ‌కులు, ఆల‌య సెక్యూరిటీ.. అగ్నిమాప‌క సిబ్బందికిస‌మాచారం ఇచ్చారు. ఘ‌ట‌నా స్థ‌లానికి అగ్నిమాప‌క సిబ్బంది వ‌చ్చి మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు.

Annavaram: శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 4 గంట‌లకు జ‌రిగిన ఈ అగ్నిప్ర‌మాదంలో ఐదు దుకాణాలు కాలిపోయాయి. భారీగా ఆస్తిన‌ష్టం సంభ‌వించింద‌ని తెలుస్తున్న‌ది. ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్ర‌మాదానికి షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణ‌మ‌ని ఆల‌య అధికారులు ప్రాథ‌మిక అంచ‌నాకు వ‌చ్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *