Annamayya : జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం కేసు విచారణలో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 23 మందిని నిందితులుగా గుర్తించగా, అందులో 16 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు జనార్ధన్‌రావు (Janardhan Rao) కూడా ఉన్నాడు.
మిగిలిన ఏడుగురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
నిందితుల కస్టడీకి ఎక్సైజ్ పోలీసుల పిటిషన్
కేసులోని అన్ని అంశాలను వెలికితీసేందుకు ఎక్సైజ్ పోలీసులు నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ తంబళ్లపల్లి (Thamballapally) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి, ఇరుపక్షాల వాదనలు విని 10 నిందితులను మూడు రోజులపాటు ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
దీంతో రేపటి నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ప్రధాన నిందితుడిపై పీటీ వారెంట్ విచారణ రేపటికి వాయిదా
మరోవైపు, కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్‌రావు అరెస్ట్‌పై పీటీ వారెంట్ కూడా దాఖలైంది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తంబళ్లపల్లి కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.