Anitha

Anitha: జగన్ అబద్ధాలు చెబుతున్నారు.. నోటీసులు ఇవ్వలేదు: హోం మినిష్టర్ అనిత 

Anitha: జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంపై హోమ్ మంత్రి వంగలపూడి అనిత రియాక్ట్ అయ్యారు. ఆఖరు నిమిషంలో తన పర్యటన రద్దు చేసుకున్న జగన్ అబద్ధాలతో అందరినీ మభ్య పెట్టాలని చూస్తున్నారని అనిత ఫైర్ అయ్యారు. ఈ విషయంపై అనిత ఇంకా ఏమన్నారంటే.. “పూటకో మాట జగన్‌కు బాగా అలవాటుగా మారింది. ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారు. దానికి ఆయనకేమైనా కారణాలు ఉంది ఉండవచ్చు. కానీ, నోటీసులు ఇచ్చారంటూ అబద్ధాలు చెబుతున్నారు. ఇలా అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు.  వైసీపీ ఆలయాల దర్శన పేరుతో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న ప్రకటన వచ్చినా.. ఒక్క నాయకుడిని కూడా గృహనిర్బంధం చేశారా? జగన్‌ను రావద్దని ఎవరూ నోటీసు ఇవ్వలేదే? మరి అలాంటప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారు? అసలు తిరుమల వెళ్లేందుకు జగన్‌కు ఇష్టంలేదు. డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే పర్యటన ఆపేసుకున్నారు. పైగా నింద ప్రభుత్వం పై వేయాలని చూస్తున్నారు.” అంటూ ఫైర్ అయ్యారు. 

Also Read: జగన్ తిరుమల పర్యటన రద్దు

Anitha: బ్రహ్మోత్సవాల సమయంలో భద్రత ఏర్పాట్లు తప్పనిసరిగా చేస్తామని.. ఏమి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయకూదా? అని ప్రశ్నించారు. అయినా.. ప్రసాదం ఇస్తే పక్కన పెట్టేవాళ్లు.. రుచి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ జగన్ మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. 

Anitha: తిరుపతి లడ్డూ విషయంలోనూ అన్నీ అబద్ధాలే చెబుతున్నారంటూ అనిత విరుచుకుపడ్డారు. భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చినందువల్లే శాంపిల్స్ లాబ్ కు పంపించామని స్పష్టం చేశారు అనిత. 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *