Anirudh-Kavya Maran

Anirudh-Kavya Maran: కావ్య మార‌న్‌తో అనిరుధ్ సీక్రెట్‌ ట్రిప్‌.. మ‌ళ్లీ ట్రెండ్‌లోకి..!

Anirudh-Kavya Maran: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహయజమానురాలు కావ్య మారన్ పేర్లు మరోసారి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమయ్యాయి. తాజాగా ఇద్దరూ విదేశాల్లో కలిసి నడుచుకుంటూ కనిపించిన వీడియో వైరల్ కావడంతో, వీరి రిలేషన్‌షిప్‌ పై ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.

ఓ యూకే వ్లాగర్ తన ట్రావెల్ వీడియోలో అనుకోకుండా వీరిద్దరినీ రికార్డ్ చేయడంతో ఈ వీడియో ఇంటర్నెట్‌లో బయటికి వచ్చింది. గ్రే స్వెట్‌షర్ట్, వైట్ పఫర్ జాకెట్‌లో అనిరుధ్, క్యాజువల్ లుక్‌లో కనిపించిన కావ్య మాట్లాడుకుంటూ నడుస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. ఇది బయటకు రావడంతో ఇద్దరూ అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్నారా? లేక యూకేనా? అన్న చర్చ కూడా మొదలైంది. కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.

ఈ వీడియో రావడంతో నెటిజన్లు మళ్లీ పెళ్లి టాక్‌పై దృష్టి పెట్టారు. “సీక్రెట్ లవర్స్ దొరికిపోయారు!” అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు “కంగ్రాట్స్ చెప్పాల్సిన రోజు దగ్గర్లోనే ఉంది” అంటూ రాసుకుంటున్నారు. వాస్తవానికి ఈ ఏడాదే అనిరుధ్–కావ్య పెళ్లి జరగబోతుందని గతంలో ఒక సోషల్ మీడియా పోస్ట్ బాగా వైరల్ అయ్యింది. అందులో అనిరుధ్ ఇప్పటికే కావ్యతో ఏడాది పైగా డేటింగ్‌లో ఉన్నాడని, రజినీకాంత్ కూడా కళానిధి మారన్‌తో మాట్లాడారని రాసుకొచ్చారు.

అయితే ఆ సమయంలోనే అనిరుధ్ ఈ వార్తలను ఖండించాడు. X‌లో “పెళ్లి? లాల్… చిల్ అవుట్ గైస్… రూమర్స్ ఆపండి” అంటూ హాస్యంగా స్పందించాడు. తరువాత కూడా అనిరుధ్ టీమ్ స్పష్టంగా “వీరిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే” అని చెప్పింది. కానీ అభిమానుల్లో మాత్రం ఈ రూమర్స్ ఆగడం లేదు.

Also Read: Bigg Boss 9: క్యాప్టెన్‌గా బిగ్‌బాస్ ముద్దు బిడ్డ.. ఇకా కంటెస్టెంట్లకి చుక్కలే..

కావ్య మారన్ గత కొన్నేళ్లుగా IPLలో అత్యంత పాపులర్ ఫేస్‌గా మారింది. SRH సహయజమానురాలు, సన్ గ్రూప్ వారసురాలు కావడంతో ఆమె ప్రతి IPL మ్యాచ్‌ హైలైట్‌గా నిలుస్తోంది. ఆమెకు సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది.

ఇక అనిరుధ్ విషయానికి వస్తే, ప్రస్తుతం దక్షిణాదిలో నంబర్‌ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫుల్ బిజీగా కొనసాగుతున్నాడు. ధనుష్ ‘3’తో కెరీర్ ప్రారంభించిన ఆయన తక్కువ సమయంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సంగీత దర్శకుడిగా ఎదిగాడు. ఒక్కో సినిమాకు దాదాపు ₹15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్. ప్రస్తుతం తమిళంలో దళపతి విజయ్ ‘జననాయకన్’, లోకేష్ కనగరాజ్ ‘డీసీ’, తెలుగులో నాని ‘ది ప్యారడైజ్’, ఎన్టీఆర్ ‘దేవర 2’ వంటి పెద్ద ప్రాజెక్టులపై పనిచేస్తున్నాడు. సన్ పిక్చర్స్ చిత్రాలకు, SRH యాంతమ్‌కూ సంగీతం ఇచ్చినందుననే వీరు తరచూ కలిసి కనిపిస్తున్నారని కొంతమంది చెబుతున్నారు.

తాజా వీడియోతో మళ్లీ హీట్ పెరిగిన అనిరుధ్–కావ్య మారన్ జంటపై, ఈసారి ఇద్దరూ ఏమంటారో అన్న దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు మాత్రం ఈ కొత్త రూమర్స్‌పై వారిద్దరూ ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *