Anil Kapoor:

Anil Kapoor: పది కోట్ల పాన్ మసాలా యాడ్ కు అనిల్ నో!

Anil Kapoor: 67 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్ నెస్ తో ప్రత్యేకమైన పాత్రలతో ముందుకు సాగుతున్నారు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్. 43 సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ‘వంశవృక్షం’ తో నటుడుగా ఎంట్రీ ఇచ్చారు అనిల్ కపూర్. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనే కాదు హాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ వస్తున్న అనిల్ తాజాగా 10కోట్ల డీల్ కి నో చెప్పాడట. అయితే తను నో అంది ఓ పాన్ మసాలా యాడ్ కి. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రచారం చేయకుండా ఉండటం తన బాధ్యత భావించే ఈ ఎండార్స్ మెంట్ కి నో చెప్పానంటున్నారు అనిల్.

ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా పాన్ మసాలా బ్రాండ్ కి అంబాసిడర్ గా ఉండనని చెప్పేశాడు. అయితే బాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ పొగాకుతో పాటు పాన్ మసాలా ఉత్పత్తులను ప్రచారం చేస్తున్నందుకు అటు సోషల్ మీడియాలో ఇటు ప్రజల నుంచి ట్రోలింగ్ ను ఎదుక్కొంటున్నారు. తెలుగులోనూ కొందరు స్టార్స్ బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేస్తున్నారు. వారు అనిల్ కపూర్, కార్తీక్ఆర్యన్ ను చూసైనా మారాలంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *