మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తన మతం మానవత్వం అని చెప్పుకుంటున్న జగన్‌ది కౄరత్వమని విమర్శించారు. ఎన్టీఆర్ భవన్‌లో 100 రోజుల పాలన అభివృద్ధి సంక్షేమాలు పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
దేశాన్ని, మతాన్ని కించపరిచేలా మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. భక్తుల మనోభావాలు గౌరవించి జగన్‌ను డిక్లరేషన్ ఇవ్వమంటే, హిందూయిజంపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు.కల్తీ లడ్డూ వ్యవహారంలో జరిగిన తప్పు ఒప్పుకోలేక, క్షమాపణ చెప్పలేక వంకర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.