Andhra Pradesh CAbinet Meet

Andhra Pradesh Cabinet Meet: ఏపీ క్యాబినెట్ సమావేశం ఈరోజు . . కీలక అంశాలపై చర్చ !

Andhra Pradesh Cabinet Meet: ఈరోజు సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది .  కీలకమైన వివిధ ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్ నిర్ణయించే అవకాశం ఉంది .  అలాగే, చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు .  ఇవి కాకుండా క్యాబినెట్ మీట్ లో ఈరోజు చర్చకు వచ్చే అంశాలు ఇలా ఉన్నాయి . .

Andhra Pradesh Cabinet Meet క్యాబినెట్ మీటింగ్ లో కొన్ని అంశాలు:
  • 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కోత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై చర్చించనున్న కేబినెట్
  • రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు రానున్న ప్రతిపాదన
  • దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
  • పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం
  • దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం.
  • దీపావళి నుండి ప్రభుత్వం ఇచ్చే ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకం పై చర్చ…
  • రాష్ట్ర కేబినెట్(Andhra Pradesh Cabinet Meet) లో చర్చకు రానున్న ప్రభుత్వ నూతన పాలసీలు
  • రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంపై చర్చించనున్న రాష్ట్ర కేబినెట్
  • పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా కొత్త పారిశ్రామిక విధానం
  • ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నూతన పారిశ్రామిక విధానం
  • వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా నూతన పాలసీ : మొత్తం 10 ప్రభుత్వ శాఖల్లో నూతన విధానాలను సిద్దం చేసిన అధికారులు
  • ముఖ్యమంత్రి వరుస సమీక్షలతో ప్రభుత్వ శాఖల్లో కొలిక్కి వచ్చిన నూతన విధానాలు
  • స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా కొత్త పాలసీల రూపకల్పన
  • జాబ్ ఫస్ట్ (ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యం) అనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వ పాలసీలు సిద్దం చేసిన ప్రభుత్వం
  • పారిశ్రామిక వర్గాల అభిప్రాయాలు, పొరుగు రాష్ట్రాల్లో ఉత్తమ విధానాలతో కొత్త పాలసీల రూపకల్పన
  • కేబినెట్ (Andhra Pradesh Cabinet Meet)ముందుకు 5-6 పాలసీలను చర్చించేందుకు ప్రతిపాదనలు
  • పారిశ్రామిక అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ , క్లీన్ ఎనర్జీ , ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ , ప్రైవేటు పారిశ్రామిక పార్కులు తదితర పాలసీలు కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం
  • ముందుగా పెట్టుబడులు పెట్టిన వారికి అదనంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రతిపాదనలు
  • ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అడిషనల్ గా 10 శాతం ప్రోత్సాహకం ఇచ్చేలా పారిశ్రామిక పాలసీ
  • దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంలో కసరత్తు
  • ఒక కుటుంబం, ఒక పారిశ్రామిక వేత్త అనే కాన్సెప్ట్ తో ఎంఎస్ఎంఈ పాలసీతీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
    విద్యుత్ రంగంలో దేశంలోనే ఏపీ అగ్రగామి గా ఉండేలా క్లీన్ ఎనర్జీ పాలసీ

Also Read: MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *