ap news

AP News: చెల్లిని చంపేసి యాక్సిడెంట్​గా చిత్రీకరించిన అన్న..ఎందుకో తెలిస్తే షాక్​

AP News: డబ్బు మనిషితో ఏదైన చేయిస్తుంది అని చల్ల సార్లు వినం కొన్నిసార్లు చూశాం.. అలాంటి ఓ సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. 1కోటి రూపాయలు కోసం సొంత చెల్లిని చంపేసి తర్వాత యాక్సిడెంట్​గా చిత్రీకరించిన అన్న . కానీ చివరికి పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ప్లాన్ చేసిన వ్యక్తి ఎలా పట్టుబడ్డాడు? దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంది.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి బీమా డబ్బులు కోసం తన చెల్లిని చంపినందుకు అరెస్టు అయ్యాడు. మాలపాటి అశోక్ కుమార్ రెడ్డి నెలల తరబడి ప్లాన్ చేసి ఆమెకు కోటి రూపాయలకు ఇన్సూరెన్స్  చేయించాడు. ఆ తర్వాత ఆమెను చంపేశాడు.రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన అశోక్ కుమార్ రెడ్డి తన సోదరిని హత్య చేసి ఆమె మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించాడు. కోటి రూపాయల బీమా డబ్బులు వసూలు చేయడానికి అతను ఈ హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Crime News: భార్యను హత్య చేసి జైలుకు.. విడుదలైన తర్వాత భర్తను అత్త ను చంపేశాడు..

AP News: ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కోటి రూపాయలు అందుకున్నాడు. భీమా చెల్లింపులను మోసం చేయడానికి విడాకులు తీసుకున్న పిల్లలు లేని తన సోదరిని హత్య చేసినందుకు అరెస్టయ్యాడు. 2024 ఫిబ్రవరి 2న పొదిలిలోని పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన ఈ నేరానికి నిందితుడు 30 ఏళ్ల మాలపాటి అశోక్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు.

అప్పుల బాధతో కొట్టుమిట్టాడుతున్న అశోక్ తన సోదరి జీవితానికి బీమా చేయించి.. హత్య చేసి ప్రమాదం జరిగినట్లు చూపించి డబ్బులు దండుకోవాలని ప్లాన్ వేసినట్లు సమాచారం. ఘటన జరిగిన రోజు అశోక్ ఆస్పత్రికి వస్తానని చెల్లికి చెప్పి కారులో ఒంగోలుకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా నిద్రమాత్రలు ఇచ్చి హత్య చేశాడని ఆరోపించారు. అనంతరం హత్యను యాక్సిడెంట్‌గా మార్చేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  High Court On Theatres: ఆ సమయంలో థియేటర్లలోకి పిల్లలకు నో ఎంట్రీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *