Anchor Shyamala: ప్రముఖ టీవీ యాంకర్ మరియు వైసీపీ మహిళా నాయకురాలు శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌కు ప్రచారం చేసినందుకు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఆమె కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ నేడు జరిగింది.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కారణంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో శ్యామలపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ‘Andhra365’ అనే బెట్టింగ్ యాప్‌ను ఆమె ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో యాంకర్ విష్ణుప్రియ, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ రీతూ చౌదరి లను కూడా గురువారం విచారించారు.
ఆన్లైన్ బెట్టింగ్‌లపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కఠిన నిషేధం అమలు చేస్తోంది. ప్రజలను ఈ యాప్స్ నుంచి దూరంగా ఉంచడానికి అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుండటం, దీనిపై పోలీసులు దర్యాప్తు కొనసాగించటం ఈ వివాదానికి మరింత ప్రాధాన్యత తీసుకువచ్చింది. హైకోర్టు క్వాష్ పిటిషన్‌పై త్వరలో కీలక తీర్పు వెలువడే అవకాశం ఉంది.