Anasuya Bharadwaj

Anasuya Bharadwaj: చెప్పు తెగుద్ది.. అనసూయ వార్నింగ్!

Anasuya Bharadwaj: ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తన కెరీర్, వ్యక్తిగత జీవితం, సోషల్ మీడియా ప్రెజెన్స్‌తో నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. అనసూయ నిరంతరం సోషల్ మీడియా ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నారు. తనపై వస్తున్న వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ వార్తల్లో నిలిచారు. ఇటీవల, “చెప్పు తెగుద్ది” అంటూ ఆమె చేసిన హెచ్చరిక పెద్ద చర్చకు దారితీసింది. తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు.

అనసూయ వివిధ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవాలు, ప్రైవేట్ ఈవెంట్‌లకు ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇటీవలే మార్కాపురంలో జరిగిన ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఆమె సందడి చేశారు. ఆ సమయంలో అనసూయ మాట్లాడుతుండగా కొంతమంది యువకులు అసభ్యకరంగా మాట్లాడడంతో అనసూయ ఫైర్ అయ్యారు. చెప్పు తెగుద్ది మీ ఇంట్లో అమ్మ, చెల్లి, ప్రియురాలు, మీ కాబోయే భార్యను ఇలాగే ఏడిపిస్తే మీరు ఊరుకుంటారా. పెద్దవారిని ఎలా గౌరవించాలో మీ ఇంట్లో వారు నేర్పించలేదా అంటూ అనసూయ ఫైర్ అయ్యారు.

ప్రస్తుతం అనసూయ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా అనసూయ సోషల్ మీడియాలో నిరంతరం ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నారు. ఆమె దుస్తులు, వ్యక్తిగత జీవితం, సినీ ఎంపికలు, కొన్నిసార్లు రాజకీయ అభిప్రాయాలపై కూడా నెటిజన్లు విపరీతంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ట్రోల్స్ హద్దులు మీరి వ్యక్తిగత దూషణలకు, అసభ్యకరమైన వ్యాఖ్యలకు దారితీయడంతో అనసూయ సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. యాంకర్‌గా ఆమె కెరీర్ కొనసాగుతోంది. జబర్దస్త్ వంటి షోల నుండి తప్పుకున్నప్పటికీ, ఆమె ఇతర టీవీ షోలు, ఈవెంట్‌లు స్పెషల్ ప్రోగ్రామ్‌లలో యాంకరింగ్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆమె గ్లామర్, వాక్ చాతుర్యం, మరియు ఎనర్జిటిక్ హోస్టింగ్‌కు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *