Amaravati: వైసీపీకి అందుకే 11 స్థానాలు వచ్చాయి..

Amaravati: మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీకి హాజరుకాకుండా బయటే ఉండి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుండటం సరైన విధానం కాదని అన్నారు. ఉన్నవి-లేనివి కల్పించి దుష్ప్రచారం చేయడం వైసీపీ నేతల పద్ధతిగా మారిందని మండిపడ్డారు.

అసెంబ్లీకి వస్తే గత పాలనలో చేసిన తప్పులు బహిర్గతం అవుతాయనే భయంతో వైసీపీ నేతలు సమావేశాలకు రావడం లేదని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వంలో చేసిన తప్పులు వెంటాడుతున్నందువల్లే అసెంబ్లీలో హాజరుకాలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.

వైసీపీ పాలన ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం సృష్టించిందని పయ్యావుల ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే కృషి చేసిందని విమర్శించారు. పేద ప్రజల అమ్మడిని ఆపినందుకు, వారి సంక్షేమాన్ని కేటాయింపులు తగ్గించినందుకు వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైందని అన్నారు.

వెలిగొండ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించలేదని వైసీపీ చెబుతోంది కానీ, తమ పాలనలోనే ప్రాజెక్ట్ పూర్తయిందని, జాతికి అంకితం చేశామని గతంలో వైసీపీ నేతలే చెప్పుకున్నారని గుర్తు చేశారు. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్ట్‌కు మళ్లీ నిధులు ఎలా కేటాయిస్తామని ప్రశ్నించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *