Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పలు కీలక భూ కేటాయింపులపై నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా విద్యా, వైద్య మరియు పరిశోధనా రంగాలకు భూముల కేటాయింపునకు ఆమోదం తెలిపారు.
మంత్రి నారాయణ తెలిపారు ప్రకారం, రాజధాని పరిధిలోని సంస్థలకు కింది విధంగా భూములు కేటాయించనున్నట్లు వెల్లడించారు: లా యూనివర్శిటీకి 55 ఎకరాల భూమిని కేటాయించనున్నారు. ఇది నూతనంగా ఏర్పాటయ్యే న్యాయ విద్య సంస్థకు ఉపయోగపడనుంది.
క్వాంటమ్ వ్యాలీ (Quantum Valley) సంస్థకు 50 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఇప్పటికే కేటాయించిన 15 ఎకరాల భూమికి అదనంగా మరో 6 ఎకరాలు మంజూరు చేయనున్నారు.
ఈ నిర్ణయాలతో రాజధాని ప్రాంత అభివృద్ధి వేగం అందుకుంటుందని, ముఖ్యంగా ఆరోగ్య మరియు విద్యా రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించవచ్చని మంత్రి నారాయణ అభిప్రాయపడ్డారు.