Auto Drivers Scheme

Auto Drivers Scheme: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కోసం.. ఆటోలో చంద్రబాబు, పవన్‌, లోకేశ్, మాధవ్

Auto Drivers Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆటో, క్యాబ్, మ్యాక్సీ డ్రైవర్‌లకు ఆర్థిక మద్దతు అందించే పథకాన్ని అధికారికంగా ప్రారంభించనుంది. ఈ పథకం ప్రకారం, ఆటో డ్రైవర్‌లకు ఒక్కోరికీ రూ. 15,000 ఆర్థిక సాయం ఇవ్వనుంది.

ఈ కార్యక్రమం విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించనున్నారు. ముఖ్య అతిధులుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొనబోతున్నారు.

Auto Drivers Scheme

ఇది కూడా చదవండి: Auto Drivers Scheme: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం.. నేడే ఖాతాల్లోకి రూ.15 వేలు జ‌మ‌

ఈ కార్యక్రమానికి ముందు, మంగళగిరి నుంచి ఆటోలో సింగ్‌నగర్‌ వరకు సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్‌ను స్వాగతించడానికి లోకేశ్ మంగళగిరి చేనేత కండువాలతో ప్రత్యేక ఆహ్వానం పలికారు. మంగళగిరి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని చూడటానికి ఆసక్తి చూపించారు. స్థానిక యువత బాణసంచా, తీన్‌మార్ డప్పులతో సందడి చేసి వాతావరణాన్ని ఉల్లాసభరితం చేశారు.

Auto Drivers Scheme

ఈ కార్యక్రమం రాష్ట్రంలోని డ్రైవర్‌లకు పెద్ద ఆర్థిక ఉపశమనం అవుతుందనే ఆశాభావాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం డ్రైవర్‌ల జీవితాన్ని సులభతరం చేయడానికి ఈ పథకం కీలకంగా నిలుస్తుందనే విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *