Amaravati: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. రాజధాని ప్రాంతంలోని మహిళలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు నమోదయ్యింది.
ఈ మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతికి చెందిన మహిళలపై అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారని శిరీష తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచేలా ఉన్నాయని ఆమె ఆరోపించారు.
తదుపరి విచారణ కోసం పోలీసులు ప్రాథమిక దర్యాప్తు నిర్వహించి, సంబంధిత సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.