Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల దాడి కొనసాగనుంది. రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు మరియు తీరప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి.
ఉత్తరకోస్తా ప్రధాన పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ
కాకినాడ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి, ఏలూరు జిల్లాలకు రేపు, ఎల్లుండి ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలు చేయవద్దని సూచించారు.