Allu Sirish

Allu Sirish: అల్లు శిరీష్ నిశ్చితార్థం ఫిక్స్! నా జీవితంలోకి ఆమె.. పోస్ట్ వైరల్!

Allu Sirish: మెగా ఫ్యాన్స్‌కు తీపికబురు! అల్లు ఫ్యామిలీలో మరో శుభకార్యం జరగనుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడంతో ఈ వార్త వైరల్గా మారింది.

‘నయనిక’తో ఎంగేజ్‌మెంట్
కొద్దిరోజులుగా అల్లు శిరీష్ పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్నా, వాటిని నిజం చేస్తూ శిరీష్ తన ఇన్‌స్టాగ్రామ్లో అధికారిక ప్రకటన చేశాడు. నయనిక అనే అమ్మాయితో తనకు నిశ్చితార్థం జరగబోతున్నట్లు వెల్లడించాడు.

ఈ సందర్భంగా ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది:
“మా తాతయ్య అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా నా మనసుకు సంబంధించిన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు నయనికతో అక్టోబరు 31న నిశ్చితార్థం జరగనుంది. చనిపోయే ముందు మా నానమ్మ నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ కోరుకునేది. ఇప్పుడు ఆమె మా మధ్య లేకపోయినా, పైనుంచి తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తుందని అనుకుంటున్నాను” అని శిరీష్ ఎమోషనల్‌గా పోస్ట్ చేశాడు.

నిశ్చితార్థం తేదీని, కాబోయే శ్రీమతి పేరును శిరీష్ ప్రకటించడంతో అల్లు ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.

సినిమాలతో బిజీ.. ఇప్పుడు పెళ్లితో సర్ప్రైజ్!
నిర్మాత అల్లు అరవింద్ గారి చిన్న కుమారుడిగా అల్లు శిరీష్ ‘గౌరవం’ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఊర్వశివో రాక్షసివో వంటి విజయవంతమైన సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.

గత ఒకటిన్నర సంవత్సరంగా శిరీష్ కొత్త సినిమాలు ఏవీ ప్రకటించకపోవడంతో ఏం చేస్తున్నాడా అని అందరూ అనుకున్నారు. ఈ సమయంలో ఉన్నట్టుండి నిశ్చితార్థం ప్రకటన చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఏదేమైనా, అల్లు ఫ్యామిలీకి ఈ శుభవార్త కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *