Allu Arjun: అమెరికాలో నిర్వహించిన నాట్స్ (NATS) సభలో టాలీవుడ్ స్టార్‌హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు, యంగ్ హీరోయిన్ శ్రీలీల కలిసి సందడి చేశారు. ఈ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులకు మంచి ఉత్సాహాన్ని నింపింది.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ..‘‘అమెరికాలో ఇంత మంది తెలుగు వారిని కలవడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.తెలుగు వాళ్లలో ఉన్న జోష్ చూస్తే ‘ఫైర్’ అనిపించదు, ‘వైల్డ్ ఫైర్’లా ఉంది. నాట్స్ అనే పేరు చూడగానే నేషనల్ అనిపిస్తుంది గానీ, ఇది ఇంటర్‌నేషనల్. మన సంస్కృతిని తరం తరాలకు పంచుతూ అద్భుతమైన పని చేస్తున్నారు. తెలుగు వాళ్లంటే ఎక్కడైనా హుషారే! ‘తగ్గేదేలే’ అంటూ మళ్లీ హుషారెత్తించాడు బన్నీ.’’
తర్వాత దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘‘నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికి 50 ఏళ్లు అయ్యాయి.ఈరోజు ఇక్కడ నేను పరిచయం చేసిన అల్లు అర్జున్, శ్రీలీల లాంటి వారితో ఇలా ఉండటం చాలా సంతోషంగా ఉంది.అమెరికాలో ఇలా అన్ని తెలుగు కుటుంబాల్ని ఒకచోట కలిపిన నాట్స్ కార్యక్రమం నిజంగా ప్రత్యేకం.సుకుమార్‌కు నాకు ఒక్క తేడా ఉంది.. ఆయనకు గడ్డం ఉంటుంది.. నాకు లేదు అంతే !నేను ‘అడవి రాముడు’లో అడవిని నమ్ముకుని స్టార్ డైరెక్టర్ అయ్యాను.సుకుమార్ ‘పుష్ప’లో అడవిని నమ్ముకుని స్టార్ డైరెక్టర్ అయ్యాడు.అల్లు అర్జున్‌ను స్టార్ హీరోగా నిలిపాడు’’ అని చెప్పారు.
డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ..‘‘అమెరికాలో నా సినిమాలకు మీరు చూపిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.‘వన్ నేనొక్కడినే’ సినిమాను ఇక్కడ ఎంతగానో ఆదరించారు. అదే నా కెరీర్‌లో మలుపు.మీ అందరి ప్రేమ వల్లే మాకు మంచి ప్రొడ్యూసర్లు దొరికారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి వారు మాకు బలంగా నిలబడ్డారు.ఈ నాట్స్ కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా అనిపిస్తోంది.మీ అందరూ ఇలాగే కలిసి ఉండాలి.. తెలుగు జాతి శుభం పొందాలి’’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి:
Nayanthara: గుడిలో భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన నయనతార .. విడాకుల రూమర్స్‌కి చెక్
Samantha: తానా 24వ మహాసభల్లో.. ఏడ్చేసిన సమంత.. కన్నీళ్లతోనే స్పీచ్ ఇచ్చిన సామ్
Vijay Setupathi: కొడుకు కోసం.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి