Vijay Setupathi: తమిళ హీరో విజయ్ సేతుపతికి ఎంత పేరు, క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పటివరకు హీరోగా ఎన్నో హిట్స్ ఇచ్చిన ఆయన.. ఇప్పుడు కథ బాగుంటే విలన్ పాత్రలకైనా ఓకే అంటున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ విజయ్ సినిమాలు మంచి ఫలితాలు అందుకున్నాయి.
ఇప్పట్లో ఆయన బిజీగా సినిమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య తన కొడుకు కారణంగా విజయ్ సేతుపతి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. విషయమేంటంటే… విజయ్ సేతుపతి కొడుకు సూర్య తొలి సినిమా ‘ఫీనిక్స్’ జూలై 4న విడుదలైంది. మొదటి రోజే ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. సూర్య నటన కూడా అందరిని ఆకట్టుకుంది.
అయితే, సినిమా ప్రీమియర్ షోలో సూర్యకి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిని తొలగించమని మీడియాపై ఒత్తిడి చేశారని వార్తలు వచ్చాయి. దాంతో ఇది పెద్ద వివాదంగా మారింది.
ఇది కూడా చదవండి: Tollywood: ‘ది 100’ ట్రైలర్ విడుదల
ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి స్పందిస్తూ.. ‘‘సోషల్ మీడియాలో చెప్పినట్టు అలాంటిదేమైనా జరిగి ఉంటే.. అది తెలిసి చేయలేదు, లేక వేరొకరు చేసివుండొచ్చు. ఎవరికైనా మనస్తాపం కలిగితే హృదయపూర్వకంగా క్షమాపణ చెబుతున్నాను’’ అన్నారు.
ఫీనిక్స్ సినిమాను స్టంట్ మాస్టర్ అనల్ అరసు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో దేవదర్శిని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. మంచి టాక్‌తో సినిమా విజయవంతంగా సాగుతోంది.
ఇక విజయ్ సేతుపతి విషయానికి వస్తే.. ఇటీవల ‘ఏస్’ అనే తమిళ సినిమా చేశారు. ప్రస్తుతం ‘తలైవన్ తలైవీ’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. నిత్యా మీనన్, యోగి బాబు సహా పలువురు నటులు ఇందులో నటిస్తున్నారు.