Allu Arjun: చంచల్‌గూడ జైలు నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విద్యల అయ్యారు. ఉదయం 6.45 నిమిషాలకు అల్లు అర్జున్‌ని జైలు అధికారులు విడుదల చేశారు. సెక్యూరిటీ రీజన్స్‌తో అల్లు అర్జున్ ని వెనుక గేట్ నుంచి పంపించారు. నిన్న ఉదయం తన ఇంటివద్ద నుంచి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినప్పటి నుంచి ఏం జరిగిందో చూద్దాం..
డిసెంబర్ 13న 11:45AM – అల్లు అర్జున్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఇంటికి వెళ్లారు.
12:00PM – అరెస్టు చేస్తున్నామని అల్లు అర్జున్‌కు పోలీసులు తెలిపారు.
12:00PM – అయితే బెడ్రూంలోకి వెల్లిన పోలీసులపై బన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
12:15PM- అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు.
12:20PM- జూబ్లిహిల్స్ నివాసం నుంచి అల్లు అర్జున్‌ను తరలించారు.
1:00PM – చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్‌ను తరలించారు.
1:15PM- అరెస్టుపై పోలీసులు రిమాండ్ రిపోర్టు రెడీ చేశారు.
1:30PM – చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బన్నీ అభిమానులు భారీగా చేరుకున్నారు.
1:50pm కి చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నాడు.
1:45PM- అరంతరం హైకోర్టులో లంచ్ మోషన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
2.00PM- ఆపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు డైరెక్టర్లు, నిర్మాతలు చేరుకున్నారు.
2:05PM గంటలకు పోలీసు వాహనాలు సిద్ధం చేశారు.
2:10 PM గంటలకు అల్లు అర్జున్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
2:35PM గంటలకు గాంధీ అసుపత్రిలో బన్నీకి వైద్యపరీక్షలు నిర్వహించారు.
3:15PM గంటలకు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ తరలించారు.
3.20PM గంటలకు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌ను పోలీసులు హాజరుపరిచారు.
3:30PM గంటలకు అల్లు అర్జున్ పిటిషన్‌పై కోర్టులో విచారణ మొదలైంది.
4:00PM గంటలకు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.
5:00pm కు అల్లు అర్జున్ కు హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కానీ జైలు అధికారులకు ఉత్తర్వులు లేట్ గా రావడంతో ఆయనను ఇవాళ ఉదయం విడుదల చేశారు.