Allu Aravind: ప్రముఖ నిర్మాత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్‌కు జీహెచ్ఎంసీ నోటీసులను జారీచేసింది. ఓ భవన నిర్మాణంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు తాజాగా మంగళవారం (సెప్టెంబర్ 9) అల్లు అరవింద్‌కు నోటీసులను జారీ చేశారు.
Allu Aravind: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో అల్లు బిజినెస్ పార్క్ పేరిట నాలుగంతస్తుల భవన నిర్మాణానికి అల్లు అరవింద్ అనుమతులు తీసుకున్నారు. ఆ భవన నిర్మాణం ఏడాది క్రితమే పూర్తయింది. అయితే ఇటీవల అనుమతులు లేకుండా ఆ భవనపై అంతస్తుపై ఓ పెంట్‌హౌజ్‌ను నిర్మించారని, దానిని ఎందుకు కూల్చొద్దో వివరణ ఇవ్వాలంటూ అల్లు అరవింద్‌కు అధికారలుఉ నోటీసులను జారీ చేశారు.

